కలుపు మొక్కలు తొలగిస్తున్న రైతులు
27-07-2026 01:16 AM
నాట్లు వేస్తున్న కూలీలు
పంటకు రసాయన మందులు కొడుతున్న రైతులు
జోరుగా వ్యవసాయ పనులు
నిర్మల్, జులై 26 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గత వారం రోజులుగా ఓ మాధురి వర్షాలు కురవడంతో వ్యవసాయ పంట క్షేత్రాలు రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసుకున్న పత్తి మొక్కజొన్న సోయా జొన్న తదితర పంటల కలుపుతీత పనులను ముమ్మరంగా చేపడుతున్నారు.
కూలీలతో పాటు వ్యవసాయ యంత్రాలతో పిచ్చి మొక్కలను కలుపుతీసి రసాయనమందులను వేస్తున్నారు. పంటలపై తెగులు రాకుండా రసాయన మందులు వాడుతున్నారు. మరోపక్క బోర్ల కింద బావుల కింద వరునాట్లను రైతులు చేపడుతున్నారు. వారం రోజులుగా జల్లులు కురవడం వాతావరణం చల్లబడడంతో వరుణ దేవుని పై వారం వేసి పనులు చేపడుతున్నట్లు రైతులు తెలిపారు.






