calender_icon.png 20 September, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు అప్రమత్తంగా ఉండాలి

30-11-2024 02:55:19 PM

గద్వాల: (విజయక్రాంతి): ప్రస్తుతం వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి శనివారం ఒక ప్రకటన ద్వారా రైతులకు తగు సూచనలు చేశారు. రైతులు పొలాల దగ్గర మరియు ధాన్యం కొనుగోలు దగ్గర ఆరబెట్టిన వరి ధాన్యాన్ని తాటి పత్రాలు కప్పుకోవాలని,  పత్తిరైతులు కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు. అదేవిధంగా పొలాల దగ్గర విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్వతహాగా మరమ్మతులు చేయవద్దని,  సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.