calender_icon.png 26 July, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత

30-11-2024 02:57:25 PM

భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని కుర్రాల కుంట నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం పాల్వంచ టౌన్ ఆర్ ఐ రవికుమార్ సీట్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా వాగుల నుంచి ఇసుక రవాణా చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణ నేపథ్యంలో తనిఖీ చేయగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు కనిపించడంతో వాటిని తాసిల్దార్ కార్యాలయానికి తరలించారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు