13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అకాల వర్షం అపార నష్టం

30-03-2026 08:44 PM

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

అఖిల భారత రైతు కూలీ సంఘం

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): ఆదివారం రాత్రి కురిసిన అకాలవర్షానికి మొక్కజొన్న రైతులకు అపార నష్టం జరిగిందని ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం మండల నాయకులు పుణెం రంగన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రకృతి వైపరీత్యాల వల్ల చేతికి అందిన మొక్కజొన్న పంట ఆదివారం గాలి తో వచ్చిన వర్షంతో రైతులు సుమారు వందల ఎకరాలలో పంట నష్టపోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు.

ఒకపక్క రైతు భరోసా రాక ఒకపక్క యూరియా కష్టాలతో రైతులు నానా అవస్థలతో సేద్యం చేస్తుంటే ఒకపక్క ప్రకృతి కన్నెర్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎకరానికి రూ.20 నుంచి 30 వేల పెట్టుబడి పెట్టారని తీరా పంట చేతికి అందే సమయానికి గాలి వానతో పూర్తిగా పంట నేలమట్టం అయిందని దీంతో ఒక్క గింజ కూడా రైతుకు దక్కే పరిస్థితి లేదని దీంతో సుమారు రైతులు ఒక్కొక్క రైతులు లక్షలలో నష్టపోయారని కావున నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి నరసింహారావు, మీడియం చందు గుమ్మడి నరేష్ ఎట్టి నరేష్ పుణెం ప్రశాంత్, పునేం లక్ష్మణ్ పాల్గొన్నారు.