30 March, 2026 | 9:51 PM

సింగరేణి కార్మికుల సమస్యలపై గళమెత్తిన టీబీజీకేఎస్

30-03-2026 08:41 PM

మెడికల్ బోర్డ్ నిర్వహించి కారుణ్య, నియామకాలు కొనసాగించాలని నిరసన 

మణుగూరు,(విజయక్రాంతి): సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారా నికి టీబీజీకేఎస్  గళమెత్తింది. మెడికల్ బోర్డు ఏర్పాటు, కారుణ్య నియామకాలు, కొనసాగించాలని స్థానిక జియం కార్యాలయం ఎదుట నల్ల జెండాలతో సోమవారం కార్యకర్తలు, నాయకులు, కార్మికులు నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం యాజమాన్యానికి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా  పవన్ కుమార్, నాగేశ్వరరావు  అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథి గా పాల్గొన్న ఏరియా టీబీజీకేఎస్  వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కార్మికుల కష్టంతో సంస్థ లాభాల్లోకి వస్తున్నప్పటికీ వారి సంక్షేమాన్ని విస్మరించడం సరికాదన్నారు.

కాంగ్రెస్ గెలిస్తే సింగరేణి సంస్థలో ఉద్యోగ అవకాశాలు పెంచి కొత్తగనులు  ప్రారంభిస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని, గుట్టు చప్పుడు కాకుండా గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు వత్తాసు పలుకుతున్నాయని ఆయన ఆరోపించారు. ఏఐటియుసి, ఐఎన్టియుసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయన్నారు. కేసీఆర్ సాధించిన కారుణ్య నియామకాలకు మంగళం పాడాలని చూస్తున్న వారి కుట్రలను కార్మికులు ఐక్యంగా ఉండి తిప్పి కొట్టాలని, కార్మిక వర్గం కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.

ఏడాది కాలంగా మెడికల్ బోర్డ్ కోసం ఎదురుచూస్తున్న సుమారు 2 వేల కార్మికులకు న్యాయం చేయాలని,విజిలెన్స్ ,మారుపేర్లు సమస్యలు పరిష్క రించాలని కోరారు. జూలై, నవంబర్ నెలలో అర్హత కలిగి అన్ ఫీట్ చేయని కార్మికులకు తిరిగి మెడికల్ బోర్డ్ నిర్వహించాలని తెలిపారు. మణుగూరు ఏరియాలో ఉపరితల విభాగంలో ఖాళీగా ఉన్న జనరల్ అసిస్టెంట్  ఖాళీలను కొండాపురం అండర్ గ్రౌండ్ జనరల్ అసి స్టెంట్ కార్మికులతో మాత్రమే భర్తీ చేయా లన్నారు. ఏరియాలో యస్.సి, యస్ టి టైం రేటెడ్ బ్యాక్ లాగ్ పోస్ట్ లు పెండింగ్ లో ఉన్నాయి.

అర్హులుగా  ఉన్న జనరల్ అసిస్టెంట్ లను గుర్తించి వాటిని భర్తీ చేయాలని, ఉపరితల ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఖాళీలను కొండాపురం అండర్ గ్రౌండ్ కార్మికులతో భర్తీ చేయడానికి సర్క్యులర్ విడుదల చేయాలని పేర్కొన్నారు. కార్మికుల ప్రాణాల తో ముడిపడి ఉన్న సమస్య లపై వెంటనే స్పందించి, పరిష్కరించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. సంస్థ ప్రగతి, కార్మిక సంక్షేమం, హక్కుల సాధన పరిర క్షణ కోసం తమ సంఘం నిరంతరం పోరా టం చేస్తుందని, కార్మిక వర్గం  మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు, ఇజ్రాయెల్, మస్తాన్, సుద్దాల సంపత్ కుమార్, పికె నాగరాజు, పరమే ష్, రమేష్ నాయక్, వెంకటేశ్వర్లు, వెంకటేష్, వినయ్ కుమార్,అశోక్ కుమార్,  ప్రసాద్, నరేష్  పాల్గొన్నారు.