25 July, 2026 | 1:29 AM

రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి

25-07-2026 12:56 AM

తాడ్వాయి, జూలై, 24 (విజయక్రాంతి): రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఎల్లారెడ్డి వ్యవసాయ శాఖ ఏడిఏ సుధా మాధురి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ రైతు వేదికలో శుక్రవారం ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు, రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎలినో ప్రభావంతో వరి వేసుకునే భూములలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. కంది, మొక్కజొన్న, కూరగాయలు, సోయాబీన్ తదితర పంటలు వేసుకోవాలని సూచించారు. ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఏడు మండలాల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. ఇటీవల బదిలీ అయిన వ్యవసాయ విస్తరణ అధికారులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నర్సింలు, ఎల్లారెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు.