25 July, 2026 | 1:41 AM

గ్రామసంఘాల పనితీరుపై సమీక్ష సమావేశం

25-07-2026 12:58 AM

గాంధారి, జూలై 24 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఐకేపీ కార్యాలయం సమావేశ మందిరంలో గ్రామ సంఘాల పనితీరుపై డిపిఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో విఓఎ  లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా గ్రామ సంఘాల పనితీరు, సభ్యుల హాజరు, సమావేశాల నిర్వహణ పై సమీక్ష నిర్వహించారు.

మహిళా సంఘాల పొదుపులు, అంతర్గత రుణాల పంపిణీ మరియు రికవరీ పురోగతి, బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాలు, పెండింగ్ రుణాల స్థితిపై చర్చించారు.. రాబోయే నెల లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళిక మరియు బాధ్యతల కేటాయింపులపై అధికారులు విఓఎ లకు పలు సూచనలు చేశారు.. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రసన్న కుమార్, మండల సమాఖ్య అధ్యక్షురాలు పుష్ప రాణి, సీసీ లు రాములు, రాజయ్య, కాశీనాథ్, శేఖర్, రాజయ్య, సౌజన్య, స్త్రీనిధి ఆర్.ఎం. కిరణ్ కుమార్, స్త్రీ నిధి మేనేజర్ నవీన్ కుమార్, విఓఎ లు పాల్గొన్నారు..