21 July, 2026 | 12:17 PM

ఆరుతడి పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి

21-07-2026 12:20 AM

రామారెడ్డి, జూలై 20 (విజయక్రాంతి): రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్నినో ప్రభావం, పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ రాకేష్ మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా కంది, పెసర, మినుము, ఆముదం, పొద్దుతిరుగుడు, సజ్జలు, రాగులు వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు.

సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు పాటిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేపడితే మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి, వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దోకి లచ్చయ్య, ఉపసర్పంచ్ రమేష్, జీపీఓ స్వామితో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.