28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

02-06-2025 04:15 PM

సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు

తుంగతుర్తి,(విజయక్రాంతి): రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి, డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు తెలిపారు.సోమవారం మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండా జెండా ఆవిష్కరించారు. అనంతరం రైతులకు జీలుగు విత్తనాల బస్తాలు పంపిణీ చేసి మాట్లాడారు.

ఈ వానకాలం సీజన్‌కు సంబంధించి 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్టె(జీలుగ)విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మండలానికి 3 టన్నులు జీలుగ విత్తనాలు వచ్చినట్లు తెలిపారు.30 కిలోల జీలుగ విత్తనాల బస్తా మొత్తం ధర రూ.4275 ఉండగా, 50 శాతం ప్రభుత్వ సబ్సిడీ పోగా, రైతు రూ. 2137 చెల్లించాలన్నారు. మండలంలో జీలుగ విత్తనాలు అవసరం ఉన్న రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వచ్చి విత్తనాలు తీసుకోవాలని కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.