28 June, 2026 | 2:04 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ

02-06-2025 04:29 PM

కాంగ్రెస్ ప్రజా పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం..

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో డిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సోనియాగాంధీ(Sonia Gandhi) నెరవేర్చారని డిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి(MLA G. Madhusudhan Reddy) అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగా లేక పోతుందన్న విషయం తెలిసినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు.

2014 నుంచి 2023 డిసెంబర్ వరకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నట్లు తెలిపారు. ప్రజా పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు.

అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ పునర్నిర్మాణంలో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్ ముదిరాజ్, వినోద్ కుమార్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, సీనియర్ నేత ఎన్ పి. వెంకటేష్., మీడియా సెల్ కన్వీనర్ సిజే బెనహర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, నాయకులు సిరాజ్ ఖాద్రీ, నయుం, అజ్మత్ అలీ, ఫయాజ్, అవేజ్, పీర్ సాదిక్, నాగరాజు, గులాం జహీర్, పైసల్, జగదీష్, అంజద్ తదితరులు పాల్గొన్నారు.