7 April, 2026 | 10:18 PM

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది

07-04-2026 08:28 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): నియోజకవర్గంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, రైతు సంక్షేమమే  ద్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, నకరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం తెలిపారు. మంగళవారం చిట్యాల పట్టణం, వట్టిమర్తి, వని పాకల, ఆరెగూడెం, పెద్దకాపర్తి, వెలిమినేడు, సుంకెనపల్లి, గుండ్రాం పల్లి గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం మద్దతు ధర తో పాటు సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తుందని,  రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కనుక రైతుల బాధలు తెలిసిన వ్యక్తి అని, రైతులకు పండించిన పంటకు బోనస్, రుణమాఫీ, రైతు భరోసా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం విచ్చిన్నం చేసిన, రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, ఎఎంసి చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, సర్పంచులు కాటం వెంకటేశం, ఆవుల సునీత యాదయ్య, ఆవుల సుందర్, బొంతల చంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు.