7 April, 2026 | 10:18 PM

108 అంబులెన్స్ తనిఖీ

07-04-2026 08:30 PM

* తనిఖీ చేస్తున్న క్వాలిటీ చెక్ డిపార్ట్మెంట్

ఆళ్లపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ఆళ్లపల్లి మండల కేంద్రంలోని 108 అంబులెన్సును క్వాలిటీ చెక్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేశారు. అంబులెన్స్ లోని పరికరాలను, వాటి స్థితిగతులను వారు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో క్వాలిటీ చెక్ డిపార్ట్మెంట్ ఫయాజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమన్వయకర్త సతీష్, స్థానిక 108 సిబ్బంది పైలట్ సునీల్ కుమార్, ఈఏంటి భాగ్యమ్మ పాల్గొన్నారు.