calender_icon.png 27 October, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

27-10-2025 06:26:47 PM

తిరుమలగిరి మార్కెట్ చైర్పర్సన్ ఎల్సోజ్ చామంతి నరేష్..

తుంగతుర్తి (విజయక్రాంతి): కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాలని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్ అన్నారు. సోమవారం నాగారం మండల పరిధిలోని ఈటూర్ ఆవాసం ప్రగతి నగర్ సిద్ది ఫైబర్, శ్రీనివాస జిన్నింగ్ మిల్లులలో సిసిఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రభుత్వం అందించే 8110 రూపాయల మద్దతు ధర పొందాలని సూచించారు.

రైతులు 8 తేమ శాతం ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. పత్తి అమ్మే రైతులు ముందుగానే కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ సురేష్, తహసిల్దార్ హరి కిషోర్ శర్మ, సీసీఐ అధికారి గిరీష్, ఏవో కృష్ణకాంత్, పిఎసిఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు తోడుసు లింగయ్య ,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు కన్నెబోయిన వెంకట బిక్షం, జిమ్మిలాల్, అంబేద్కర్,సైదులు మిల్లు యాజమాన్యం లక్ష్మీనారాయణ జహంగీర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.