17-10-2025 11:25:24 PM
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పేదరిక నిర్మూలన ద్వారా మెరుగైన సమాజ స్థాపన జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ అన్నారు. శుక్రవారం పాల్వంచ మండలంలోని కుంటి నాగులగూడెంలో జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతు నిరుద్యోగం, చదువుకోవాల్సిన వయసులో పనికి వెళ్లడం లాంటి ప్రధానమైన కారణాలు పేదరికంను సూచిస్తాయని తెలిపారు.
ఆర్థిక అసమానతలు తగ్గించడం, దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి సంక్షేమ పథకాలు అందించడం ద్వారా పేదరికం తగ్గించవచ్చు అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామాలలో బాల్య వివాహాలను నిషేధించాలని కోరారు. పేదరికంను తగ్గించడం కోసం మహిళలు డ్వాక్రా గ్రూపులో చేరడం మరియు స్వయం సహాయక ఉపాధి అవకాశాలను కల్పించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది తోట మల్లేశ్వర రావు, పాల్వంచ టౌన్ ఎస్ఐ జీవన్ రాజ్, పారా లీగల్ వాలంటీర్స్ బాడీషా బిక్షమయ్య, ఎం. జానకిరామ్, కె.వీరభద్రం,ఆర్. పి నాగమణి, గ్రామ పెద్దలు దశరాజు, రమేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.