27-10-2025 06:41:56 PM
ఎరువుల సరఫరా కార్డుల పంపిణీ..
గరిడేపల్లి (విజయక్రాంతి): సహకార సంఘం పరిధిలోని రైతులు ఎరువుల సరఫరా కార్డులను సద్వినియోగం చేసుకోవాలని రాయనిగూడెం పిఎసిఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ కోరారు. కీతవారిగూడెంలో సోమవారం సహకార సంఘం కార్యాలయంలో ఎరువుల సరఫరా కార్డులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ఈ ఎరువుల సరఫరా కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. రైతులు ఎరువుల సరఫరా కార్డుల ద్వారా వారికి అవసరమైన ఎరువులను సకాలంలో పొందవచ్చు అని తెలిపారు.
కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు బాలూరి అంజయ్య, పోటు నాగేశ్వరరావు, సంఘం సీఈవో నిడిగొండ కనకయ్య, సిబ్బంది కాట్రేవుల లక్ష్మయ్య, పాలెల్లి అంజయ్య, దొంగరి శ్రీను, నకరికంటి సాయిలు, కేశ గాని హరీష్, రైతులు ముత్తినేని సుబ్బయ్య, కోటేశ్వరరావు, దొంగరి కోటయ్య, చిత్తలూరీ వీరస్వామి, ముత్తినేని రామయ్య,జుట్టుకొండ లక్ష్మయ్య,కీత రమేష్,షేక్ నాగుల మీరా,కీత అంజయ్య,కీత వెంకటేశ్వర్లు, జుట్టు కొండ సైదయ్య, ముత్తినేని సైదులు తదితరులు పాల్గొన్నారు.