calender_icon.png 27 October, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుఫాను వల్ల పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి

27-10-2025 06:43:48 PM

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు, సలహాలు

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తుఫాను వలన అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మార్కెటింగ్, పౌరసరఫరాలు, ఎఫ్ సి ఐ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ రాబోయే 2, 3 రోజులలో తుఫాను వల్ల రకాల వర్షాల కారణంగా వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయా పంట కొనుగోలు ప్రక్రియలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం మద్దతు ధరతో ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. 

జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, జిల్లా వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్, రవాణా, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయడం కొరకు 40 కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందని, ఇప్పటివరకు 24 వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు కొరకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలో పత్తి కొనుగోలుకు సి సి ఐ ఆధ్వర్యంలో 18 జిన్నింగ్ మిల్లులను గుర్తించి నవంబర్ మొదటి వారంలో పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే 2, 3 రోజులలో తుఫాను వల్ల పంటలు నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.