calender_icon.png 18 February, 2026 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సద్వినియోగం చేసుకోవాలి

18-02-2026 12:55:35 AM

భీమదేవరపల్లి, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) ప్రభుత్వం రైతులకు అందిస్తున్న స బ్సిడీ వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని ఉద్యానవన శాఖ అధికారి అనసూయ పేర్కొన్నారు. భీమదేవరపల్లి మండ లం ముల్కనూరులో సహకార బ్యాంక్ అధ్యక్షులు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి పంట క్షేత్రం వ ద్ద జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారురైతులకు పామ్ ఆయిల్ సాగుపై అవగాహ న కల్పించే ఉద్దేశంతో ముల్కనూర్ కోఆపరేటివ్ రూరల్ క్రెడిట్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతు అవగాహన కా ర్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉద్యానవన, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులతో పాటు పామ్ ఆయిల్ రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన సెరికల్చర్ అ ధికారి అనసూయ మాట్లాడుతూ, పామ్ ఆ యిల్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాల వివరాలను రైతు లకు వివరించారు. ఈ అవకాశాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.వరంగల్ జిల్లా ఉద్యానవన సెరికల్చర్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పా మ్ ఆయిల్ సాగులో అనుసరించాల్సిన శా స్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించారు.

నో-టిల్లేజ్ విధానం, కలుపు మందుల వినియోగం చేయకూడదని, కొమ్మల కత్తిరింపు అవ సరం లేదని తెలిపారు. అలాగే ఫెర్టిగేషన్ ద్వారా ఎరువుల మోతాదు, వినియోగ విధానాలపై రైతులకు స్పష్టంగా వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ మరియు హనుమకొండ ఏడీఏ ఆది రెడ్డి మాట్లాడుతూ, దేశంలో పామ్ ఆయిల్ అవసరం అధికంగా ఉండటంతో దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పామ్ ఆయిల్ సాగు భారతీయ రైతులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన పంటగా మారిందని, దేశీయ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రైతులు ఈ సాగును విస్తరించాలని సూచించారు.

జైన్ ఇరిగేషన్ జోనల్ మేనేజర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ, డ్రిప్ ఇరిగేషన్ విధానాల ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలో వివరించారు. ఫెర్టిగేషన్ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ నిర్వహణ, సంరక్షణ ఎంతో కీలకమని రైతులకు సూచించారు.ఆయిల్ ఫెడరేషన్ జిల్లా మేనేజర్ శంకర్ మాట్లాడుతూ, ఆయిల్ ఫెడరేషన్ ద్వారా రైతులకు అందిస్తున్న మార్కెటింగ్ సౌకర్యాలు, కొనుగోలు విధానం,

చెల్లింపుల ప్రక్రియపై వివ రించారు. కలెక్షన్ సెంటర్లో పంట కొనుగోలు చేసిన మూడు పని దినాల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా చెల్లింపులు జమ చేయబడతాయని తెలిపారు.ఈ సందర్భంగా వరంగల్,దామెర ప్రాంతాలకు చెందిన విజయవంతమైన పామ్ ఆయిల్ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. పామ్ ఆయిల్ సాగు ద్వారా పొందుతున్న లాభా లు, ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారాలను వివరించి రైతులకు ప్రోత్సాహం అం దించారు.కార్యక్రమం ముగింపులో సొసైటీ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ,

రైతులు శాస్త్రీయంగా మరియు ఆర్థి కంగా లాభదాయకమైన సాగు పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. పామ్ ఆయిల్ సాగు మంచి లాభా లను ఇచ్చే పంటగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనార్థం విలువైన స మయం కేటాయించి సమాచారం అందించిన ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికా రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా పామ్ ఆయిల్ సాగుపై రైతుల్లో ఉన్న అనేక సందేహాలు, అపోహలు తొలగాయని, సమావే శంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.