అకాల వర్షంతో అన్నదాతకు నష్టం
10-06-2026 01:45 AM
నిర్మల్, జూన్ 9 (విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం వేకువ జామున కురిసిన భారీ వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. రవి సీజన్లో రైతులు పండించిన మొక్కజొన్న జొన్న వరి పంటలు అమ్ముకోవడానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నిలువ చేయగా వర్షం కారణంగా వరద నీరు పంట చుట్టూ చేరుకోవడంతో పంట మొత్తం తలసిపోయిందని రైతులు తెలిపారు.
కుంటాల ఓలా కల్లూరు బైంసా కుబీర్ భైంసా తదితర ప్రాంతాల్లో రైతులకు నష్టం జరిగినట్టు రైతులు తెలిపారు. ఎంత తడిసిపోయి రంగు మారి మొలకలు వస్తే ప్రభుత్వ కొనుగోలు నిలిపివేస్తారని దీనివల్ల తమకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే తడిసిన పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.






