పడకేసిన పారిశుద్ధ్యం
10-06-2026 01:44 AM
గొల్లగూడ కాలనీలో మురుగునీటితో నిండిన కాల్వ
వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలం కమాన గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లగూడ కాలనీలో పారిశుద్ధ్యం పడకేసింది. నెలల తరబడి పంచాయతీ సిబ్బంది మురుగునీటి కాల్వలను శుభ్రం చేయకపోవడంతో ఎక్కడికక్కడ పూడిక పెరుకుపోయింది.
మురుగునీరు మురికి కాలువలో నిల్వ ఉండడంతో తీవ్ర దుర్గంధం వెద జల్లుతుండడంతో కాలనీవాసులు నరకయాతన అనుభవిస్తున్నామంటున్నారు. కాల్వను సకాలంలో శుభ్రం చేయాలని పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని, ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గొల్లగూడెంలోని మురుగును పూర్తిస్థాయిలో తొలగించి తమ గొల్లగూడ కాలనీలోని ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.






