calender_icon.png 24 July, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి రైతుల అండ

20-07-2024 12:05:00 AM

ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు

కామారెడ్డి, జూలై 19(విజయక్రాంతి): తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి రైతులు అండగా ఉన్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. శుక్రవారం రాజం పేట్, తాడ్వాయి మండలాల్లోని కొండాపూర్, ఎర్రపహడ్ గ్రామాల్లో రైతు రుణ మాఫీ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును అదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.