calender_icon.png 23 July, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుండిగల్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

19-07-2024 09:37:30 PM

దుండిగల్ : మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై అతివేగంతో కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులు వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.