15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపిన రైతులు

27-06-2025 12:19 AM

పటాన్‌చెరు, జూన్ 26 : మాజీ మంత్రి హరీశ్ రావును పటాన్ చెరు నియోజవకర్గ బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు.  పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం మండలాల రైతులకు రైతు భరోసా రాకపోవడంపై ఇటీవల జిన్నారంలో బీఆర్‌ఎస్ నాయకులు నిర్వహించిన మహా ధర్నాలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రశ్నించారు. స్పందించిన మంత్రులు నాలుగు మండలాల రైతులకు రైతు భరోసా నిధులు మంజూరు చేశారు.

ఈ నేపథ్యంలో నియోజకవర్గ బీఆర్‌ఎస్ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ  బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నాగలి అందజేసి గొంగలి కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వెంకటేశం గౌడ్, సోమిరెడ్డి, గోవర్దన్ రెడ్డి, రాములు యాదవ్, ప్రకాశ్ చారి, ఆంజనేయ యాదవ్, మాణిక్ యాదవ్, రాజేశ్, ప్రభాకర్ రెడ్డి, శివరాజ్, ఆంజనేయులు, జనార్దన్, నరేందర్, సురేందర్ గౌడ్, సత్యనారాయణ ఖదీర్, శ్రీనివాస్ రెడ్డి, నవీన్, రవీందర్, రామక్రిష్ణ, తదితరులుపాల్గొన్నారు.