calender_icon.png 23 July, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ నివారణపై యువతకు చైతన్యం కల్పించండి

27-06-2025 12:21:20 AM

జిల్లా కలెక్టర్ హైమావతి

సిద్దిపేట, జూన్ 26(విజయక్రాంతి): అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని, సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం ర్యాలీ నిర్వహించి, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల బారిన పడి ఎవరు తమ జీవితాలను నాశనం చేసుకోకూడదు.

ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై, సమాజాన్ని ఈ ముప్పు నుంచి రక్షించాలన్నారు. సిపి అనురాధ మాట్లాడుతూ, డ్రగ్స్ను దూరంగా పెట్టే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి డ్రగ్ ఫ్రీ సమాజ నిర్మాణం కోసం పని చేస్తున్నాం, అని తెలిపారు.

అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించబడింది. విద్యార్థులు, అధికారులు, పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీసు శాఖ సిబ్బంది, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.