calender_icon.png 20 January, 2026 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

20-01-2026 12:11:11 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

బూర్గంపాడు,జనవరి19(విజయక్రాంతి): రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటే శ్వర్లు అన్నారు. సోమవారం బూర్గంపాడు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న కూలీల కొరతను అధిగమించేందుకు ఈ యాంత్రిక పరికరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

బూర్గంపాడు మండలానికి సుమారు రూ.28లక్షల రాయితీ రావడం ఆనందకరమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సబ్సిడీపై పరికరాలు అందు కున్న రైతులు ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏడిఎ తాతారావు, ఎంపీడీవో జమలారెడ్డి, ఏవో శంకర్, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, టీపీసీసీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ భజన సతీష్, మాజీ ఎంపీపీ రోశిరెడ్డి,ఉప సర్పంచ్ గుండె వెంకన్న,మహమ్మద్ ఖాన్, కైపు లక్ష్మీనారాయణ రెడ్డి,భజన ప్రసాద్,గాదె నర్సిరెడ్డి, వరాల వేణు పాల్గొన్నారు.