01-11-2025 05:47:45 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): అకాల వర్షానికి కొత్తపల్లి మండలంలో పంట నష్టపోయిన రైతులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని, తడిసిన ధాన్యం ఏ కండిషన్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని బిజెపి కొత్తపల్లి మండల అధ్యక్షులు కుంట తిరుపతి డిమాండ్ చేశారు. శనివారం కొత్తపల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులను ఆదుకోవాలని ఆందోళన చేపట్టి ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ మెంథా తుపాను రైతులకు కన్నీరు మిగిల్చిందని, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే తాలూ, తరుగు తేమ పేరిట రైతాంగాన్ని వేధించకుండా, ఇబ్బంది పెట్టకుండా పంట ఏ స్థితిలో ఉన్న కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, రైతులు పాల్గొన్నారు.