calender_icon.png 1 November, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భిక్షాటన చేస్తూ ఎస్ఎఫ్ఐ నిరసన

01-11-2025 05:39:48 PM

కరీంనగర్ (విజయక్రాంతి): భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల పైన ఉన్న శ్రద్ధ విద్యార్థులపైన ఎందుకు లేదని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యార్థులకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు దీనిపైన నిర్ణయం తీసుకొని విద్యార్థులకు రావాల్సిన బకాయిలను విడుదల చేసే విధంగా పని చేయాలని ఆకాంక్షించారు. లేనియెడల ఈనెల 4న మంత్రుల ఇళ్ళను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్ సాగర్, దుర్గం భోగేష్, జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు రాకేష్, సందేశ్, నాయకులు సన్నీత్, సంతోష్, రామ్ చరణ్, దుర్గా, సాయి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.