calender_icon.png 21 February, 2026 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి ఇలవేల్పు ఆలయ అభివృద్ధే లక్ష్యం

21-02-2026 05:58:42 PM

తల్లి జ్ఞాపకర్ధం తనయుల ఔదార్యం

రూ.లక్ష రూపాయలతో గర్భగుడి సుందరికరణ

ధర్మపురి,(విజయక్రాంతి): తమ ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ అన్నారు. మార్చి నెలలో జరిగే శ్రీరేణుక ఎల్లమ్మ కొలుపు లో భాగంగా ఆలయ గర్భ గుడిలో ఆలయ చైర్మన్ యొక్క తల్లి కీశే మెరుగు రామక్క జ్ఞాపకర్ధం ఆమె కుమారులైనటువంటి మెరుగు అశోక్ గౌడ్, మెరుగు శోభన్ గౌడ్, మెరుగు నరేష్ గౌడ్ లు సుమారు రూ.1 లక్ష  విలువ గల గ్రానైట్ ను(పాలరాతి) బండను అమ్మ వారి ఆలయంలో వెయిస్తూ ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ రేణుక ఎల్లమ్మ పై వారికి ఉన్న భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. గతంలో కూడా ఆలయం చుట్టూ నరేష్ గౌడ్ చోరువ తో లచ్చుల గారి శ్రీనివాస్ గౌడ్ సుమారు రూ.ఒక లక్ష యాభై వేలతో ప్లోరింగ్ చేయడం జరిగిందని తెలిపారు.రాబోయే రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.