calender_icon.png 21 February, 2026 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకలి తీర్చే అన్నదానమే గొప్పది..

21-02-2026 05:54:50 PM

- మునిసిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి 

- 368 వారానికి చేరిన ఆనంద

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో శనివారం అమ్మ ఒడి ఎన్జీవో అన్నదాత ప్రాజేక్ట్, టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదానo నిర్వహించారు. బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావా స్వాతి, వైస్ చైర్మన్ రాగం శెట్టి సత్యనారాయణ చేతుల మీదుగా అన్నదానం నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్విరామంగా కొనసాగించాలనే సదుద్దేశంతో మే 5, 2020 లోచేపట్టిన అన్నదానం ఇంకా ఆకలి నీ తీరుస్తూ బెల్లంపల్లి పట్టణంలో 368వ  వారానికి చేరుకున్నది.

జునుగూరి లక్ష్మి -బానయ్య  జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు కొడుకులు-కోడళ్ళు జునుగూరి నాగులు-లత, రవికుమార్ -పుష్పలత, తిరుపతి, సుదర్శన్ మనుమలు, మనుమరాళ్ళసహకారంతో అన్నదాన చేపట్టారు. అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా  బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్  హనుమాండ్ల మధుకర్,కౌన్సిలర్స్, అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ, సమ్మన్న, యం డి యుసుఫ్, చెందుపట్ల లింగమూర్తి పాల్గొన్నారు.