10 August, 2026 | 7:43 PM

ఆర్బీఐ(ఏ) జిల్లా అధ్యక్షుడిగా రహమత్ ఖాన్

02-09-2025 06:33 PM

మందమర్రి,(విజయక్రాంతి): రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అతవాలే) పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా పట్టణంలోని యాపల్ ప్రాంతానికి చెందిన ఎండి రహమత్ ఖాన్, జిల్లా కార్యదర్శిగా కాసిపేట మండలం కోమటిచేనుకు చెందిన దర్శనాల వెంకటస్వామి లను  నియమిస్తూ ఆర్బిఐ(ఎ) రాష్ట్ర ఉపాధ్యక్షులు తుగపిండి రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పట్టణ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. జిల్లా నూతన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నెలకొన్న స్థానిక, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం అయ్యేవరకు ఉద్యమాలు నిర్వహించాలన్నారు.

జిల్లాలోని ప్రతి మండలంలో, గ్రామాల్లో కమిటీలను వెంటనే నియామకం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు నాయకులు సిద్ధం కావాలని కోరారు.  అనంతరం జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులు రహమత్ ఖాన్, వెంకటస్వామిలు మాట్లాడుతూ మాపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బాధ్యతలు  ఇచ్చినందుకు రాష్ట్ర ఉపాధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేసి జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.