calender_icon.png 17 November, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాలకు అడ్డాగా ఫాంహౌస్‌లు

23-07-2024 12:05:00 AM

  • గుట్టుచప్పుడు కాకుండా అసాంఘిక కార్యక్రమాలు 
  • ఇటీవల ఫాంహౌస్‌లు, విల్లాల్లో వెలుగు చూస్తున్న హత్యలు, కిడ్నాప్‌లు 
  • దృష్టి సారించని పోలీసులు

రంగారెడ్డి, జూలై 22 (విజయక్రాంతి): నగరానికి దూరంగా ప్రశాంతత కోసం నిర్మించుకున్న ఫాంహౌస్‌లు, విల్లా లు ఇప్పుడు నేరాలకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. రౌడీషీటర్ల సెటిల్‌మెంట్లు, ఆగడాలకు వేదికగా నిలుస్తున్నాయి. వీకెండ్ పార్టీల పేరుతో విల్లాలు, ఫాంహౌస్‌లు బుక్ చేసుకొని అసాంఘిక కార్యక్రమాలకు  తెరలేపుతున్నారు. నిర్వాహ కులు బర్త్‌డే, గెట్ టు గెదర్ పార్టీల పేరు చెప్పి యువతను ఆకర్షించి ఫాంహౌస్‌లు, విల్లాలకు రప్పిస్తున్నారు. అనంతరం వారితో పేకాట, మందు, రేవ్ పార్టీలతో విందు, వినోదాల్లో ముంచెత్తుతూ పెడదోవ పట్టిస్తూ కాసులను తమ జేబులో వేసుకుంటున్నారు. పలు ఫాంహౌస్‌లు గంజాయి, డ్రగ్స్ సరఫరాకు, కిడ్నాప్‌లకు, హత్యలు, వ్యభిచారాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

ఇటీవల సిటీ శివారు ప్రాంతా ల్లో జరిగిన పలు ఉదంతాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అసాంఘిక కార్యక్రమాలపై అడపాదడపా ప్రజల నుంచి ఏమై నా ఫిర్యాదులు వస్తేనే తప్ప పోలీసులు స్పం దించిన దాఖలాలు లేవన్నది వాస్తవం. రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, కందు కూరు, శంషాబాద్, కడ్తాల, ఆమ నగల్లు, యాచారం సిటీ శివారు ప్రాంతాలకు దగ్గరగా ఉండడంతో పలువురు రియల్ వ్యాపారులు సమీపంలో భూములను కొనుగోలు చేస్తున్నారు. అక్కడే  ఫాంహౌస్‌లు, విల్లాలు అన్ని సౌకర్యాలతో నిర్మిస్తూ వీకెండ్ పార్టీలకు అద్దెలకు ఇస్తు గుట్టుగా వ్యాపారం చేస్తున్నారు.

ప్రైవసీ పేరిట అసాంఘిక కార్యక్రమాలు 

పలువురు బడాబాబులు, సాఫ్ట్‌వేర్, సినీ, రాజకీయ ప్రముఖులు వీకెండ్‌లో ప్రైవసీ పేరిట, సరదాల కోసం విల్లాలు, ఫాంహౌస్‌ల బాట పడుతున్నారు. భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో అక్కడే యథేచ్ఛగా పేకాట, జూదం, వ్యభిచారాలు కొనసాగుతున్నాయి. వీకెండ్‌లో ఒక్కో విల్లా, ఫాంహౌస్‌కు సౌకర్యాలను బట్టి రోజు కు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దె వసూలు చేస్తుండడం గమనార్హం. సరదాల కోసం మిత్రులు, కంపెనీల ప్రతినిధులు, వ్యా పారవేత్తలు ఇలా పార్టీలు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనినే కొందరు తమకు అనుకూలంగా మలుచుకొని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడు తున్నారు.

ఇక్కడే పేకాట అడ్డాలు, వ్యభిచార కేంద్రాలను కూడా కొనసాగిస్తున్నారు. అమ్మాయిలను తీసుకొచ్చి సోషల్ మీడియా వేదికగా యువతను ఆకర్షించి పార్టీలకు రప్పిస్తున్నారు. కొందరూ నిర్వాహకులు పోలీసులను మచ్చిక చేసుకొని నెలవారీగా డబ్బులు ముట్టచెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీకెండ్‌లో అర్ధరాత్రులు అయితే చాలు కార్లు, వివిధ వాహనాలు ఫాంహౌస్‌లు బాట పడుతుండడంతో సమీప గ్రామాల ప్రజలంతా భయపడుతున్నారు. పార్టీల పేరుతో వారు చేస్తున్న వికృత చేష్టలకు ఆందోళనకు గురవుతున్నారు.

కొరవడిన నిఘా.. 

ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా కొరవడడంతో నేరాలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో జరిగే అసాంఘిక కార్యక్రమాలపై ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడులు జరిపి అరెస్టులు చేస్తున్నా స్థానిక పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. 

ఫాంహౌస్‌లపై దృష్టి సారిస్తున్నాం.. 

ఫాంహౌస్‌లు, విల్లాల్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిం ది. అలాంటి వాటిపై ప్రత్యేక బృందాలతో నిఘా పెడుతున్నాం. ప్రతి నిత్యం రాత్రిపూట పోలీసులతో గస్తీ నిర్వహిస్తూ అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకొకుండా చర్యలు తీసుకుంటున్నాం. మా పరిధిలో ఉన్న ఫాంహౌస్‌ల వివరాలను సేకరిస్తున్నాం. అసభ్యకర కార్య క్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం.

రంగస్వామి, షాద్‌నగర్ ఏసీపీ ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు

  1. కడ్తాలలోని బట్టర్ ఫ్లు సిటీలో గోవిందాయిపల్లి గ్రామానికి చెం దిన ఇద్దరు యువకుల దారుణ హత్య చోటుచేసుకొంది. ఇదే మండలంలో గతేడాది క్రితం ఓ ఫాంహౌస్‌లో ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహిం చారు. అక్కడ కొందరు నిర్వాహకులు పార్టీల పేరుతో అమ్మాయిలను తీసుకొచ్చి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వారి ని అరెస్టు చేశారు.
  2. చేవెళ్ల మండలం మొయినాబాద్‌లో ముజ్రా పార్టీపై పోలీ సులు దాడులు చేసి అసభ్యకరంగా నృత్యాలు చేస్తున్న యువ తులు, యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
  3. ఇటీవల ఫరూఖ్‌నగర్ మం డలంలోని ఓ ఫాంహౌస్‌లో నార్సింగ్ మున్సిపాలిటీకి చెందిన కమ్మరి కృష్ణ అనే పొలిటీషియన్ మర్డర్ వెలుగు చూసింది.
  4. వారం రోజుల క్రితం రాజేంద్రనగర్‌కు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్, అతని మిత్రుడిని భూ సెటిల్‌మెంట్ విషయంలో కొందరూ రౌడీషీట ర్లు కిడ్నాప్ చేసి శంషాబాద్ సమీపంలోని ధర్మగిరిలో అక్రమంగా నిర్మించిన ఓ ఫాం హౌస్‌లో ని ర్బంధించి చిత్రహింసలు పెట్టారు.
  5. ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లోని ఫాంహౌస్‌ల్లో పేకాట, జూదం, వ్యభిచారం ఘటనలు కూడా వెలుగు చూశాయి. ఇలా వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రమే. ఇంకా గుట్టుచప్పుడు ఎన్నెన్ని దారుణాలు జరుగుతున్నాయో మరీ.