ప్రొఫెసర్ జయలక్ష్మిపై కుట్రలు ఆపాలి
- లేదంటే ఆగస్టు 3న జేఎన్టీయూ ముట్టడి
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్, జూలై 31(విజయక్రాంతి): జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ జయలక్ష్మిపై కుట్రలను విరమించుకోవాలని, లేనిపక్షంలో ఈనెల 3న జేఎన్‌టీయూను ముట్టడిస్తామని బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర సాగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగరతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జేఎన్‌టీ యూ చరిత్రలో తొలి మహిళా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన బీసీ వర్గానికి చెందిన ప్రొఫెసర్ జయలక్ష్మిని 45 రోజుల్లోనే తొలగిం చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వం 24 గంటల్లో ఈ కుట్రలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘాల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో గణేశ్ చారి, గుజ్జ కృష్ణ, కులకచర్ల శ్రీనివాస్, శ్యాం కుర్మా, సత్యరాజ్, సంధ్య, శ్రీనివాస్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






