calender_icon.png 24 May, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

24-05-2025 09:16:42 AM

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) శనివారం నాడు కేరళను తాకనున్నాయి. రుతుపవనాలు కేరళను(Kerala) తాకుతాయని భారత వాతావరణ శాఖ విభాగం అంచనా వేసింది. రానున్న2,3 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి విస్తరించే అవకాశముందని వాతావరణ శాఖ(India Meteorological Department) ప్రకటించింది. జూన్ రెండో వారం నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. లక్షద్వీప్, కర్నాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోకి కూడా రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని తెలిపింది. అరేబియా సముద్రం(Arabian Sea Cyclone)లో దక్షిణ కొంకణ్- గోవా తీరానికి సమీపంలో తీవ్ర అప్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ఐఎండీ తన సూచనలో గుజరాత్, కొంకణ్, గోవా, కర్ణాటక, కేరళలో వచ్చే వారం పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మే 23 నుండి 25 వరకు కొంకణ్, గోవాలో, మే 24 నుండి 27 వరకు కర్ణాటక తీరప్రాంత, దక్షిణ ఇంటీరియర్‌లో, మే 25న మధ్య మహారాష్ట్రలో మే 25, 26 తేదీలలో తమిళనాడులోని ఘాట్ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. "రాబోయే రెండు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంది" అని ఐఎండీ పేర్కొంది. ఈ సీజన్ త్వరలో ప్రారంభమవుతుందని సూచిస్తుంది. దక్షిణ, పశ్చిమ ప్రాంతాలు వర్షాలకు సిద్ధంగా ఉండగా, ఉత్తర -వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న వేడిగాలుల పరిస్థితుల గురించి వాతావరణ శాఖ హెచ్చరించింది.