calender_icon.png 24 May, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో “నీతి ఆయోగ్” సమావేశం.. పాల్గొననున్న సీఎం రేవంత్

24-05-2025 08:51:51 AM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అధ్యక్షతన శనివారం నాడు నీతి ఆయోగ్(NITI Aayog meeting) పాలకమండలి సమావేశం ప్రారంభం కానుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా నీతి ఆయోగ్ సమావేశం నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించనున్నారు. రాష్ట్రాలు కలిసి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఇవాళ నీతి ఆయోగ్ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొననున్నారు. 2018 తర్వాత తొలిసారిగా నీతి ఆయోగ్ భేటీకి సీఎం రేవంత్ హాజరు కానున్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ సమావేశం ఏర్పాటు చేశారు. భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎంలతో కలిసి రేవంత్ రెడ్డి అల్పాహారం చేయనున్నారు. ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి గ్రూప్ ఫొటో దిగనున్నారు.

వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్(Viksit Bharat 2047) అజెండాగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ కానుంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి రాష్ట్ర లక్ష్యాలు, పాలసీలపై సీఎం నివేదించనున్నారు. ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్ లో ప్రభుత్వ చర్యలను రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, డ్రై పోర్ట్, స్పోర్ట్స్ వర్సిటీ, స్కిల్ వర్సిటీ, ఐటీఐలను ఏటీఆర్ లుకా మార్పు, యువతకు నైపుణ్య శిక్షణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలపై(Telangana Welfare schemes) సీఎం వివరించనున్నారు. ఇవాళ పలువురు కేంద్రమంత్రులు, ఏఐసీసీ నేతలను సీఎం కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.