3 July, 2026 | 8:29 PM

Breaking News

దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •   ప్రవీణ్ కుమార్‌పై మంత్రి వ్యాఖ్యలు సరికాదు   •   ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే   •  

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

30-06-2025 12:00 AM
  1. జాతీయ రహదారిపై నుంచి సర్వీస్ రోడ్డుపై బోల్తా పడ్డ ప్రైవేట్ బస్సు
  2. ముగ్గురికి తీవ్ర గాయాలు, 25 మందికి స్వల్ప గాయాలు
  3. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

అదిలాబాద్, జూన్ 29 (విజయ క్రాంతి) :  ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా,  25 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరా బాదు నుండి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఆదివారం తెల్లవారుజామున గుడిహత్నూర్  మండల కేంద్రంలో జాతీయ రహదారిపై నుండి అదుపు తప్పి 20 అడుగులకింద ఉన్న సర్వీసు రోడ్డుపై బోల్తాపడింది.

ఈ ప్ర మాదంలో ఆనంద్ అగర్వాల్, ఇర్ఫాన్ మ న్సూరీ, గడుగు నరేందర్ లకు తీవ్ర గాయా లు కాగా, 25 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఐదు 108 అంబులెన్స్ ల్లో క్షతగా త్రులను ఆదిలాబాద్ రిమ్స్ తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.