12 July, 2026 | 4:47 AM

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

29-06-2024 01:03 AM

13 మంది మృతి.. నలుగురికి గాయాలు

బెంగళూరు, జూన్ 28: కర్ణాటకలోని హవేరీ జిల్లాలో శుక్రవారం ఓ ప్రయాణికుల వ్యాను లారీని ఢీకొట్టడంతో 13 మంది మరణించారు. నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బ్యాగడి తాలూకా గుండెనహళ్లి క్రాసి ంగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. 48 నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో వ్యాను బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో వ్యానులో 17 మంది ఉన్నారని, ఘటనా స్థలంలోనే 11 మంది మరణించినట్టు వెల్లడించారు. ఇద్దరు దవాఖానలో చనిపోయారని పేర్కొన్నారు. క్షతగాతృలకు దవాఖానలో చికిత్స అందిస్తున్నామని వివరించా రు. ఈ ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.