సిమ్లాలో కూలిన కొండచరియలు
భారీ వర్షాలే కారణం
న్యూఢిల్లీ జూన్ 28: ఐదు రోజులు ఆలస్యంగా హిమాచల్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వచ్చీరావడంతోనే రాష్ట్రం లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో సిమ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు వాహనాలు ఆ కొండచరియల కింద చిక్కుకున్నాయి. జూన్ 22నే రావాల్సిన రుతుపవనాలు రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించాయి. 12 జిల్లాల్లో ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. నేటి నుంచి ౪రోజుల పాటు 10 జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు హిమాచల్‌లో 84.3 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా.. కేవలం 39.5 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదయింది. నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






