12 July, 2026 | 3:41 AM

వరదల్లో ఐదుగురు జవాన్ల్లు మృతి

30-06-2024 01:41 AM

టీ-72 యుద్ధ ట్యాంకుతో నది దాటుతుండగా ఘటన

లడఖ్, జూన్ 29: లడఖ్‌లో ఘోరం జరిగింది. భారత సైనికులు విన్యాసాలు చేస్తుండగా నది ఉప్పొంగటంతో ఐదుగురు సైనికులు మరణించారు. వాస్తవ ధీన రేఖకు దగ్గరలో ఉన్న బోధి నదిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. న్యోమా ఏరియాలోని బోధి నదిలో టీ-72 యుద్ధ ట్యాంకుతో వెళ్తున్న సైనికులు ఆకస్మిక వరదలతో గల్లంతయ్యారు. గల్లంతైన ఐదుగురు సైనికుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వారి కోసం నదిలో గాలింపు చర్యలను చేపట్టినట్లు, దురదృష్టవశాత్తు వారంతా ప్రాణాలు కోల్పో యారని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు.