calender_icon.png 27 December, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం

10-07-2024 10:48:10 AM

రంగారెడ్డి: అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ తండ్రి ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బుధవారం చోటు చేసుకుంది.  బీఎన్ రెడ్డికి చెందిన అశోక్ అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో కారులో ప్రయాణించారు. కారును ఇనాంగూడ చెరువులోకి మళ్లించడంతో కారుతో సహా నలుగురు నీటిలో మునిగిపోయారు. కారు నీటిలో మునిగిపోవడం గమనించిన స్థానికులు వెంటనే స్పందించి తాడు సహయంతో నలుగురిని బయటకు తీశారు. ప్రాణాలతో తండ్రి, ముగ్గురు పిల్లలు బయటపడ్డారు. బీఎన్ రెడ్డి నగర్ లో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న అశోక్ ఇవాళ ఉదయం పూట నడక కోసం పిల్లలను తీసుకువచ్చాడు. అత్మహత్యయత్నంకి గల కారణాలు తెలియాల్సి ఉంది.