8 March, 2026 | 1:47 AM

కాంగ్రెస్‌లో కొత్త కోటరీ!

08-03-2026 12:22 AM

సైకిల్ కాంగ్రెస్!

  1. పార్టీలో అవకాశాలన్నీ తన వర్గానికే కట్టబెడుతున్న సీఎం 

తాజాగా వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ టిక్కెట్ ఇవ్వడంతో మరోసారి స్పష్టం

అనేక మంది సీనియర్ నాయకులు.. అయినా దక్కని పదవులు

అసంతృప్తిలో పాతతరం కాంగ్రెస్

గతంలో మాదిరిగానే ‘బీటీ బ్యాచ్’కే ప్రాధాన్యత అని విమర్శలు

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి) : గత ప్రభుత్వ హయాంలో బంగారు తెలంగాణ (బీటీ) బ్యాచ్‌గా పిలిచే వర్గానికే ప్రాధా న్యత దక్కిందనే విమర్శలు అప్పట్లో తీవ్రంగా వినిపించాయి. ప్రభుత్వం, పార్టీ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు, ముఖ్యమైన పదవులు ప్రధానంగా అదే వర్గానికి చెందిన నేతలకే కేంద్రీకృ తమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపించేవి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో ఒక ప్రత్యేక వర్గానికే అవకాశాలు ఎక్కువగా దక్కుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతు న్నది.

ముఖ్యమంత్రి చుట్టూ ఏర్పడిన కొత్త కోటరికి కీలక అవకాశాలు కట్టబెట్టబడుతున్నారనే విమర్శలు వినిపిస్తుండ గా, పార్టీ కోసం అనేక ఏళ్లుగా పనిచేస్తున్న పాతతరం నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. కీలక పదవులు, నామినేషన్లు, రాజకీయ అవకాశాలు కొన్ని వర్గాలకే పరిమితమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో అధికార పార్టీలో అంతర్గత చర్చ మళ్లీ వేడెక్కుతున్నది.

తెలంగాణలో కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలో కొత్త సమీకరణాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చుట్టూ ఆయ న సొంత కోటరి ఏర్పడుతోందని, కీలక అవకాశాలు ప్రధానంగా అదే వర్గానికి దక్కుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా గా వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వ డం ఈ చర్చలకు మరింత బలం చేకూర్చింది. 

రేవంత్ చుట్టూ కోటరీ..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక రాజకీయ అవకాశాలు, నామినేషన్ పదవులు ప్రధానంగా ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న నేతలకే దక్కుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. సీఎం చుట్టూ ఏర్పడిన ఈ వర్గం ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ వ్యవ హారాలపై ప్రభావం చూపుతోందని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యం గా ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ నియామకాలు, పదవుల కేటాయింపులు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

అయితే అధికారం లో ఉన్న ప్రతి ప్రభుత్వంలోనూ నాయకత్వం చుట్టూ ఒక కోర్ టీమ్ లేదా నమ్మకమైనవర్గం ఏర్పడటం సాధారణమేనని విశ్లేషకులు అం టున్నారు. పాలనను సమర్థవంతంగా నడిపించడానికి సీఎంకు సన్నిహితంగా పనిచేసే నేత ల బృందం అవసరం కూడా ఉంటుందని వారు చెబుతున్నారు. కానీ అదే సమయంలో అన్ని వర్గాలకు సమతు ల్యంగా అవకాశాలు ఇవ్వక పోతే పార్టీలో అసంతృప్తి పెరిగే ప్రమా దం కూడా ఉం టుందని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పాత తరం నాయకులు, కొత్తగా చేరిన నేతలు, ప్రాం తీయ వర్గా లు వంటి అనేక సమీకరణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను సమన్వ యం చేస్తూ ముం దుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే కోటరీ రాజకీ యాలు పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీయవచ్చని కూడా వారు సూచిస్తున్నారు.

పెరుగుతున్న అసంతృప్తి..

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితవర్గం ప్రభావం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గతంలో ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలకు అవకాశాలు ఎక్కువగా దక్కుతున్నాయనే విమర్శలు పాతతరం కాంగ్రెస్ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. దీనిని కొందరు నేతలు వ్యంగ్యంగా ‘సైకిల్ కాంగ్రెస్’గా కూడా అభివర్ణిస్తున్నారు. దీనికితోడు చాలా కాలంగా కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు తమకు తగిన ప్రా ధాన్యత దక్కడంలేదని అంటున్నారు.

ఇటీవల రాజ్యసభ స్థా నాల కోసం పార్టీలోని చాలా మంది సీనియర్లు పోటీపడ్డారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి మరీ ఒక టిక్కెట్ వేం నరేందర్‌రెడ్డి ఇప్పించుకున్నా రు. తెలంగాణలో కాంగ్రెస్ కోసం ఎన్నేళ్లు గా పనిచేసిన అనేక మం ది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వారికి అవ కాశం దక్కకపోవడం పాత తరం నేతల్లో అసంతృప్తిని పెం చిందని పార్టీ వర్గా లు చెబుతున్నాయి.

ఈ నిర్ణయం ద్వారా సీఎం తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం మరిం త బల పడిందని రాజకీయ పరిశీలకులు వ్యా ఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచే సిన నాయకులను ఇప్పుడు పక్కన పెడుతున్నారనే భావన కొందరిలో పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో కూడా కాంగ్రె స్‌ను నిలబెట్టిన జిల్లాల నాయకులు,

సీనియర్ కార్యకర్తలు ఇప్పుడు అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమా చారం. పార్టీ కోసం ఎన్నేళ్లు కష్టపడ్డా అవకాశాలు రావడం లేదు. ఇటీవల పార్టీలోకి వచ్చి న వారికే ప్రాధాన్యత దక్కుతోంది అనే వ్యాఖ్య లు అంతర్గతంగా వినిపిస్తున్నాయి. దీనివల్ల పార్టీ లో పాత తరం, కొత్త వర్గాల మధ్య ఒక స్పష్టమైన విభజన ఏర్పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

రాజకీయ సమీకరణలు..

గతంలో బీఆర్‌ఎస్ పార్టీలో బీటీ బ్యాచ్ ఏర్పడిందని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు.. గత ప్రభుత్వ ధోరణిని అనుకరించడంపై అసంతృప్తి పెరుగుతున్నది. దీం తో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అంతర్గత సమన్వయం కీలక అంశంగా మారింది. రాబోయే రోజుల్లోనైనా నామినేటెడ్ పదవులు, సంస్థల్లో నియామకా లు, రాజకీయ అవకాశాల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తేనే కాంగ్రెస్‌లో అసంతృప్తిని తగ్గించవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.

లేకపోతే పార్టీలో అంతర్గత అసమ్మతి మరింత బహిరంగంగా బయటపడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ కాం గ్రెస్‌లో ప్రస్తుతం కొత్త రాజకీయ సమీకరణా లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, వర్గాల మధ్య సమతౌల్యం ఎలా నిలబెడతాయన్నదే రాబో యే రోజుల్లో పార్టీ రాజకీయ దిశను నిర్ణయించే అంశంగా మారనుంది.