12 August, 2026 | 1:36 AM

అనుమానాస్పద స్థితిలో మామ, అల్లుడి మృతి

12-08-2026 12:00 AM

కల్తీ కల్లు కారణమంటున్న స్థానికులు

తాండూరు, ఆగస్టు 11 (విజయక్రాంతి): అనుమానాస్పద స్థితిలో మామ, అల్లుడు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామంలో మం గళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లియాకత్ (54), గోరెప్ప (35) వరుసకు మేనేమామ అల్లుడు అవుతారు. సోమవారం రాత్రి ఓ వి వాహ వేడుకకు హాజరయ్యే ముందు కల్లు సే వించి వివాహ విందులో భోజనం చేసి తాము పనిచేస్తున్న పాలిషింగ్ యూనిట్ గదిలో పడుకున్నారు.

తెల్లారేసరికి ఇద్దరు విగత జీవులుగా పడి ఉండడంతో స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇరువురి మృతికి కల్తీ కల్లు కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.