12 August, 2026 | 1:34 AM

సేంద్రియ వ్యవసాయంతో నేల ఆరోగ్యం

12-08-2026 12:00 AM
  1. రైతులకు అధిక ఆదాయం
  2. బూర్గుల రైతు వేదికలో సేంద్రియ సాగుపై శిక్షణ

షాద్‌నగర్, ఆగస్టు 11 (విజయక్రాంతి): సేంద్రియ వ్యవసాయం అంటే రసాయన ఎరువులు, పురుగుమందులను నివారిస్తూ ప్రకృతి సహజ పద్ధతుల్లో పంటలు సాగు చేయడమని వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ అన్నారు. మంగళవారం బూర్గుల రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వ్య వసాయంపై రైతులకు శిక్షణ కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా  అయన మా ట్లాడుతూ  సేంద్రియ వ్యవసాయంలో పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరు వులు, జీవ ఎరువులను వినియోగించాలని సూచించారు. పురుగుల నియంత్రణకు వేపపిండి, గోమూత్ర కషాయం, పసుపు, వేప నూనె వంటి సహజ పద్ధతులను ఉపయోగించవచ్చన్నారు.

అలాగే చుక్కల నీటి పారు దల, వర్షపు నీటి సంరక్షణ ద్వారా నీటిని ఆ దా చేసుకోవాలని తెలిపారు. పంట మార్పి డి, అంతర పంటల సాగు, పచ్చిరొట్ట ఎరువుల వినియోగంతో నేల సారాన్ని పెంచుకో వచ్చన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా రసాయన రహిత ఆహారం లభించడంతో పాటు నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని, పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు అ ధిక ఆదాయం లభించే అవకాశం ఉందని తె లిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు శిక్షణ సంస్థ వ్యవసాయ అధికారి రజియా సుల్తా నా, ఏఈఓ కిరణ్మయి, బూర్గుల ఏఈఓ రాంబాబ కడియలకుంట సర్పంచ్ రాజు నాయక్, కాశిరెడ్డిగూడ సర్పంచ్ రామలింగం, పలువురు రైతులు పాల్గొన్నారు.