16-05-2025 12:00:00 AM
కార్వాన్, మే15: దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కూతురును దారుణంగా హత్య చేశాడు. కత్తి తో గొంతు కోసి పాశవికంగా హతమార్చిన హృదయ విదార ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుం ది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకా రం.. నేపాల్ దేశానికి చెందిన జగత్, గౌరీ దంపతులు. కొన్నేళ్ల క్రితం వీరు గోల్కొండ ప్రాంతానికి వలస వచ్చారు.
స్థానికంగా క్రిస్టల్ అపార్ట్మెంట్లో ఉంటూ అక్కడే వాచ్మెన్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు గతంలో ఇద్దరు కుమార్తెలు ఉ న్నారు. మరోమారు 14 రోజుల క్రితం గౌరీ మరో కుమార్తెకు జన్మనిచ్చింది. ఇదిలా ఉం డగా, వారం రోజులుగా జగత్ అన్నం తినడం లేదు. ముభావంగా ఉంటున్నాడని గౌరీ పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలో జగత్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నట్లు తెలియజేసింది.
ఈ నేపథ్యంలో జగత్ గురు వారం తెల్లవారుజామున రెండు గంటలకు 14 రోజుల పసికందును బయటకు తీసుకెళ్లి ఇంటి గేటు సమీపంలో కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఉదయం నిద్ర లేచిన తర్వాత గౌరీ కూతురు కోసం చూడగా జరిగిన విష యం వెలుగు చూసింది. అనంతరం ఆమె గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని ఆసుపత్రికి తరలించారు.
అలా జరిగింది..
14 రోజుల పసికందును చంపేసిన జగత్ ను పోలీసులు విచారించారు. ’అలా.. జరిగింది..’ అని అతడు పోలీసులకు చెప్పడం గమనార్హం. ఈ మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.