15-05-2025 11:07:01 PM
సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్..
కొండపాక: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్(District Additional Collector Garima Agrawal) అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఛాంబర్ లో గురువారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ మాట్లాడుతూ... పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, పరీక్షలలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
ఈనెల తేది 22 నుంచి 29 వరకు జరగనున్న పరీక్షల నిర్వహణకు జిల్లాలోని మొత్తం 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి లోటు పాటు లేకుండా కరెంటు, నీళ్లు, అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, వైద్య, మిషన్ భగీరథ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.