17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

గీతంలో విజయవంతంగా ముగిసిన ఎఫ్డీపీ

11-06-2025 01:25 AM

పటాన్ చెరు, జూన్ 10 : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదులో కంప్యూటర్ ఆర్గనైజేషన్, ఆర్కిటెక్చర్ పై నిర్వహించిన వారం రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్డీపీ) విజయవంతంగా ముగిసింది. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధస్సు-డేటా సైన్స్ (ఏఐ&డీఎస్) విభాగాలు సంయుక్తంగా ఈ ఎఫ్డీపీని హైబ్రిడ్ విధానం (ఆన్ లైన్, ఆఫ్ లైన్)లో నిర్వహించి, గీతం మూడు ప్రాంగణాల ఆచార్యులకు తగిన మార్గనిర్ధేశనం చేశారు.

ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్ మధు ముత్యం, మహీంద్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ భార్గవ రాజారాం, డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆలపాటి వంటి ప్రముఖ నిపుణులు (రిసోర్స్ పర్సన్లు) విస్తృత శ్రేణి అంశాలను వారికి విశదీకరించారు. వీటిలో హార్డ్ వేర్ ఫండమెంటల్స్, మెయిన్ మెమరీ ఆర్కిటెక్చర్, ఇన్ స్ట్రక్షన్-లెవల్ ప్యారలలిజం, క్యాచి మేనేజ్మెంట్, సిస్టమ్ ఆఫ్టిమైజేషన్ టెక్నిక్ వంటివి ఉన్నాయి.

స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి, సీఎస్‌ఈ డీన్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ శాంతి చిలుకూరి, సీఎస్‌ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా, ఏఐ&డీఎస్ విభాగాధిపతి ప్రొఫెసర్ వి.శిరీష నేతృత్వంలో, డాక్టర్ యు.శ్రీనివాసరావు, శ్రీసౌమ్యల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారం రోజుల అధ్యాపక వికాస కార్యక్రమంలో గీతం హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం ప్రాంగణాలలోని 70 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.