12 March, 2026 | 10:17 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ఫీజు బకాయలు వెంటనే చెల్లించాలి

03-03-2026 12:59 AM

తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఫీజు రియంబర్స్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న పథకాన్ని కాపాడుకుంటామని అన్నారు.

ఈ మేరకు సోమవారం బషీర్ ప్రెస్ క్లబ్ లో 18 బీసీ సంఘాల సమావేశం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ళ సతీష్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు రూ. 6 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, ఇప్పుడు అవి రూ.8 వేల కోట్ల కు చేరాయన్నారు.

కనీసం గత రెండేళ్లు గా ఉన్న బకాయిలు అయిన చెల్లించాలని డి మాండ్ చేశారు. ఈ నెల 6న కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముం దు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ నేతలు నీల వెంకటేష్ ముదిరాజ్, సి.రాజేందర్, జి. అనంతయ్య, మోడీ రాందేవ్, కిషోర్ యాదవ్, నిఖిల్ పటే ల్, లవకుమార్, అంజి గౌడ్, నరేష్ గౌడ్, మేకల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.