calender_icon.png 14 February, 2026 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీబిల్ సిటీ రోడ్డు పనులు ప్రారంభం

14-02-2026 12:00:00 AM

చురుకుగా సాగుతున్న పనులు

రాజేంద్రనగర్ ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి) : గత ఏడాది క్రితం నిధులు మంజూరైనప్పటికీ పనులు చేపట్టడంలో అటు అధికారులు ఇటు కాంట్రాక్టర్ పూర్తిగా నిర్ల క్ష్యం వహించిన ఫీబిల్ సిటీ రోడ్డు పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉండి రోడ్డు ఎప్పుడూ వేస్తారు అని ఎదురు చూస్తూ వచ్చిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

సుమా రు గత ఏడాది క్రితం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న సమయం లో అప్పటి పాలకవర్గం సాధన మెడికల్ కాలేజ్ మలుపు నుండి దాదాపు 900 మీటర్ల పొడవున సీసీ రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లలను కేటాయించింది. ఈ పనులను చేపట్టేందుకు గత ఏడా ది సెప్టెంబర్‌లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అయినప్పటికీ పను లు మాత్రం అనుకున్నంత త్వరగా ప్రారం భం కాలేదు ఇటీవల గత మూడు పర్యాయాలు‘ విజయ క్రాంతి‘ దినపత్రికలో రోడ్డు దుస్థితి గురించి వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. వర్షం వచ్చిందంటే ఎత్తు ప్రాంతం నుండి వచ్చిన వరద నీరు ఈ మలుపు దగ్గర పెద్ద చెరువును తలపించేది ఈ రోడ్డు నిర్మాణంతో ఫిబల్ సిటీ స్నేహిత హిల్స్ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే ప్రజలకు రోడ్డు ఎంతగానో ఉపయోగపడనుంది.

20 రోజుల్లో పూర్తి చేస్తాం: ఏఈఈ నాగిరెడ్డి

 ఫీబిల్ సిటీ రోడ్డు పనులను 20 రోజుల్లో పూర్తి చేస్తాం. దాదాపు 90 మీటర్ల పొడవునా సీసీ రోడ్డు నిర్మించి అక్కడి నుండి ఫిబిల్ సిటీ వరకు బీటీ రోడ్డును నిర్మిస్తాం వరద నీటి లెవెల్ చూసుకుంటూ రోడ్డును నాణ్యతగా నిర్మిస్తామని ఒక సైడు రోడ్డు నిర్మాణం పూర్తి అయిన వెంటనే మరో సైడ్ రోడ్డును నిర్మించి 20 రోజుల్లో పూర్తి ప్రయాణికులకు రోడ్డు ను వినియోగం లోకి తీసుకొస్తామని ఎ ఈ ఈ నాగిరెడ్డి తెలిపారు.