calender_icon.png 25 November, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్‌ఈఐ విద్యాసంస్థల సంగం-2025

25-11-2025 12:00:00 AM

భారతీయ జ్ఞాన పరంపరతో సాంస్కృతిక మహోత్సవం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): ఎఫ్‌ఈఐ విద్యాసంస్థల అనుబంధ శాఖలు మార్స్ సీడ్స్, సీడ్స్ ప్రైమరీ, ఏరియన్, యురానస్ క్యాంపస్ వార్షికోత్సవం ‘సంగం 2025’ బిహెచ్‌ఇఎల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా శిశు వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్, పాఠశాల చైర్మన్ బొల్లినేని సీనయ్య, హెడ్ అకడమిక్ డాక్టర్ జయశ్రీ నాయర్, ఆయా శాఖల పాఠశాల ప్రిన్సిపల్స్ హాజరయ్యారు.

‘భారతీయ జ్ఞాన పరంపర’ ఇతివృత్తంగా సాగిన ఈ వేడుకను ప్రధాన అతిథి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాఠశాలల చిన్నారులు ప్రాచీన భారతీయ జ్ఞాన పరంపరలో భాగమైన వ్యవసాయం, వాస్తుశి ల్పం, గురుకుల విద్యా విధానం, శాస్త్రీయ పరిశోధనలు, మహిళా శౌర్యం వంటి అంశాలను ప్రతిబింబించే నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాణి రుద్రమాదేవి, రాణి లక్ష్మీబాయి వంటి మహిళా వీరనారి మణుల పరాక్రమాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలు భారతీయ సంస్కృతి విలువలను ప్రేక్షకుల ముందుంచాయి.

డాక్టర్ శివరంజని సంతో ష్ మాట్లాడుతూ, విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర అపారమైనది. పిల్లల్లో స్వతంత్రంగా ఆలోచించే శక్తిని, సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించాలి అని సూచించారు. చైర్మన్ బొల్లినేని సీనయ్య మాట్లాడుతూ.. ‘విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు కీలకమైన పాత్ర పోషిస్తారు అన్నారు.

హెడ్ అకడమిక్స్ డాక్టర్ జయశ్రీ నాయర్ భారత జ్ఞాన వ్యవస్థలోని పురాతన సంస్కృతి, విజ్ఞానం, తత్వశాస్త్రాలను ఆధునిక విద్యతో అనుసంధానించేందుకు ‘సంగం’ ఒక వేదికగా నిలు స్తోంది అన్నారు. వివిధ శాఖల ప్రిన్సిపల్స్ ప్రియాంక గుడికందుల, శ్రీతమ దాస్, మీన తలకాల, గరిమ కుమార్ తమ శాఖల విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.