calender_icon.png 25 November, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలవాలి

25-11-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

తరిగొప్పుల, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమా నికి అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో ముందుండే విధంగా కృషి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలు పునిచ్చారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో కలెక్టర్ ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముందుగా నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న చీరల పంపిణి కార్యక్రమాన్ని పరిశీలించి, ప్రతీ మహిళకు చీర అందజేయాలని ఆదేశించా రు.అనంతరం అబ్దుల్ నాగారం లో ఏర్పా టు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని కలెక్టర్ సందర్శించి ఏ రోజుకి ఆ రోజు వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలని, ఎక్కువ రోజులు కేంద్రా లలో పెట్టుకొని రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కొనుగోలు కేంద్రాలలో ఏమైనా ఇబ్బందులు ఉ న్నాయా అని కలెక్టర్ స్వయంగా రైతులను అడిగి తెలుసుకున్నారు. చివరగా కేజీవీబీ ని సందర్శించి భోజనం కి ఉపయోగించే ప్రతీ వస్తువుని కలెక్టర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మైపాల్ రెడ్డి, ఎంపీడీఓ లావణ్య, కార్యదర్శి రవీందర్, సి ఏ స్వప్న, ఖాతా బాలయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.