calender_icon.png 25 November, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్రమాదం

25-11-2025 12:00:00 AM

-సెంట్రింగ్ కూలి ముగ్గురు కార్మికులు దుర్మరణం

-స్లాబ్ పెచ్చులు మీద పడి ప్రాణాలు కోల్పోయిన కూలీలు

-సనత్‌నగర్ ఆస్పత్రిలో ఘటన

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): నగరంలోని సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనంలో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా సోమవారం సెంట్రింగ్ స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అక్కడే పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు స్లాబ్ పెచ్చుల కింద చిక్కుకుని దుర్మరణం పాలయ్యారు. గత కొంతకాలంగా సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలోని ఓ పాత భవనం పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.

సోమవారం పలువురు కార్మికు లు సెంట్రింగ్ పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఊహించని విధంగా పైనున్న స్లాబ్ పెచ్చు లు, సెంట్రింగ్‌తో సహా ఒక్కసారిగా వారిపై కూలిపడ్డాయి. క్షణాల్లో జరిగిన ఈ ఘటనలో కార్మికులు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. శిథిలాల కింద చిక్కుకుని తీవ్ర గాయాలతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. భారీ శబ్దం రావడంతో సమీపంలో ఉన్న ఇతర కార్మికులు, ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న సనత్‌నగర్ పోలీసులు, అత్యవసర సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగించి, మృతదే హాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాల పాటించడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత భవనానికి పనులు చేస్తున్న ప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకున్నారా, సెంట్రింగ్ ఏర్పాటులో నాణ్యత లోపించిందా, అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.