25 March, 2026 | 2:31 AM

రేపు రజక సర్పంచ్‌లకు అభినందన సభ

25-03-2026 12:48 AM

బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం

ముఖ్యఅతిథులుగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, ఢిల్లీ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెస్ తిరుమలి, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు 

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన రజక సర్పంచ్‌లకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసినట్టు బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు తెలిపారు. 12,700 పైచిలుకు సర్పచ్‌లలో రజకులు 116 మంది, ఉప సర్పంచ్ 210 మంది, వార్డు సభ్యులు 2,257 మంది ఎన్నికయ్యారు. ఎన్నికల్లో గెలిచిన వివిధ సామాజికవర్గాల సర్పంచ్‌లను ఒక తాటి మీదికి తీసుకురావాలన్న సంకల్పంతో అభినందన సభ నిర్వహిస్తున్నట్టు సూర్యారావు వెల్లడించారు.

ఇటీవల సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో గంగిరెద్దుల సామా జికవర్గం నుంచి గెలిచిన 50 మంది, జోగి సంఘం నుంచి గెలుపొందిన 18 మంది ప్రజాప్రతినిధులను, నాయీబ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన 18 మంది సర్పంచ్‌లను బీసీ సమాజ్ ద్వారా అభినందనలు తెలియజేసినట్టు వివరించారు.

మార్చి 26న రవీంద్రభారతిలో రజక సామాజికవర్గం నుంచి గెలుపొందిన 116 మంది సర్పంచ్‌లకు ఆత్మీయ సత్కారం, కుమ్మరి, వడ్డెర, ఉప్పర, ఆరెకటిక, పద్మశాలి వంటి అన్ని బీసీ కులాలలోని 5,035 మంది సర్పంచ్‌లను బీసీ సమాజ్ ద్వారా ఒక తాటిమీదికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని, భవి ష్యత్తులో బీసీల రాజ్యాధికారానికి ఈ కార్యక్రమాలు ఎంతో తోడ్పాటు ఇస్తాయని పేర్కొ న్నారు.

రజక సర్పంచ్‌ల అభినందన సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, బహుజనులందరూ హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అథితులుగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, ఢిల్లీ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెస్ తిరుమలి, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు హాజరవుతారని వెల్లడించారు.